Tuesday 30 July 2013

శ్రీలు పొంగిన జీవగడ్డై


Lyrics in Telugu:

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై (2)
వ్రాలినది యీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా !

వేద శాఖలు పెరిగె నిచ్చట ఆదికావ్యంబలరెనిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !

విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట 
విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా !

సూత్ర యుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్యచండిమ 
చిత్రదాస్యముచే చరిత్రలు చెరగిపొయెనె చెల్లెలా !

మేలి కిన్నెర మేళవించీ రాలు కరగగ రాగమెత్తీ 
పాలతీయని బాల భారత పథము పాడర తమ్ముడా !

నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవుల విందుగ 
కవితలల్లిన కాంత హృదయుల గారవింపవె చెల్లెలా !

దేశగర్వము దీప్తిచెందగ దేశ చరితము తేజరిల్లగ 
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా !

పాండవేయుల పదును కత్తులు మండి మెఱసిన మహితరణకధ 
కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవె చెల్లెలా !

లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదములు చేర్చి పాడర తమ్ముడా !

తుంగభద్రాభంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడని తెలుంగునాథుల పాట పాడవె చెల్లెలా !

Lyrics in English:

Sreelu Pongina JeevaGaddai 
Paalu Paarina BhagyaSeemai (2)
Vraalinadi Ee Bharatha Khandamu 
Bhakthi Paadara Thammudaa..!

Veda Sakhalu perigenichhata

Aadikaavyambandenichhata
Baadaraayana Paramarushulaku
Paadu Summidi Chellelaa!

Vipina Bandhura Vruksha Vaatika Upanishanmadhuvolikenichhata
Vipula Tatvamu Vistarinchina 
Vimala Talamide Tammudaa !

Sutra Yugamula Shuddha Vaasana 
Kshaatra Yugamula Sourya Chandima
Chitra Daasyamulache Charitralu
Cheragi Poyene Chellelaa !

Meli Kinnera Melavinchi
Raalu Karagaga Raagametti
Paalateeyani Baala Bhaarata 
Padamu Paadara Tammudaa !

Navarasammulu Naatyamaadaga 
Chivuru Palukulu Chevula Vinduga
Kavitalallina Kaanta Hrudayula 
Gaaravimpave Chellelaa !

Desagarvamu Deepti Chendaga
Desacheritamu Tejarillaga
Desamarasina Dheerapurushula 

Telisi Paadara Tammudaa !

Paandaveeyula Padunu Kattulu 
Mandi Merasina Mahitaranakadha
Kandagala Chikkani Telungula 
Kalisi Paadave Chellelaa !

Lookamantaku Kaakapettina 
Kaakatiyula Kadana Paanditi
Cheekipovani Cheva Padamulu 
Cherchi Paadara Tammudaa !

Tungabhadraabhangamulato
Pongi Ningini Podichi Trulli 
Bhanga Padani Telugu Naadhula
Paata Paadave Chellela !

No comments:

Post a Comment