Friday, 30 August 2024

వీరగంధము తెచ్చినారము

 వీరగంధము తెచ్చినారము


రచన : త్రిపురనేని రామస్వామి చౌదరి గారు 

సంగీతం : కె మల్లిక్ గారు 

బృందగానం

 

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ

పూసిపోదుము మెడను వైతుము పూల

దండను భక్తితో

 

తెలుగు బావుటా కన్ను చెదరగ కొండ

వీటను ఎగిరినప్పుడు

తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను దాచినప్పుడు

 

||వీర గంధము||

 

ఇదిగో ఉన్నది వీరగంధము మేన లందుము మేనలందుము

శాంతి పర్వము చదువ వచ్చును శాంతి సమరంబైన పిమ్మట

 

||వీర గంధము||

 

తెలుగునాటను వీరమాతలు చేసి మాత్రము తిరిగి రండిక

పలు తుపాకులు పలు ఫిరంగులు దారి కడ్డము రాక తప్పవు

 

||వీర గంధము||

No comments:

Post a Comment